- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ యాభై వేలు దాటిన కరోనా కేసులు.. ఈ ఏడాది ఆల్ టైమ్ రికార్డు
దిశ, వెబ్ డెస్క్: తీవ్రత తగ్గినా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఏడాది క్రితం రోజులను గుర్తుకు తెస్తూ నానాటికీ వీర విహారం చేస్తున్నది. దేశంలో గడిచిన 24 గంటల్లో (గురువారం ఉదయం నాటికి) 53,476 మందికి పాజిటివ్ సోకింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇక ఈ ఏడాదిలో కరోనా కేసుల సంఖ్య యాభై వేల మార్క్ దాటడం ఇదే ప్రథమం. నిన్నటి (47,262 కేసులు) తో పోల్చితే 13 శాతం కొత్త కేసులు నమోదవడం గమనార్హం. కాగా.. గతేడాది అక్టోబర్ 23 తర్వాత రోజూవారీ కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఐదు నెలల తర్వాత ఇదే తొలిసారి.
కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,17,87,534 కు చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసులు 3,95,192 ఉన్నాయి. గత 24 గంటల్లో వైరస్ కారణంగా 251 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,60,692 కు చేరింది.
గురువారం నమోదైన కొత్త కేసులలో మహారాష్ట్ర నుంచే 30 వేలకు పైగా ఉన్నాయి. తర్వాత పంజాబ్, కేరళ, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.