- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దగ్గుబాటి సురేష్ బాబుకు టోకరా.. కేటీఆర్ ఆఫీస్ నుంచే..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబును ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. వ్యాక్సిన్ ఇప్పిస్తానని లక్ష రూపాయలకు కుచ్చు టోపీ పెట్టాడు. వివరాలలోకి వెళితే.. కరోనా కష్టకాలంలో సినీ నిర్మాతలు వారి ఆఫీస్ స్టాఫ్ కి వ్యాక్సిన్ వేయించడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సురేష్ బాబు ఆఫీస్ కి.. నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి.. తాను కేటీఆర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని, తమ దగ్గర 500 డోసుల కరోనా టీకాలు ఉన్నాయని తెలిపాడు. టీకాలు కావాలంటే తన భార్య ఖాతాకు రూ. లక్ష బదిలీ చేయాలని కోరాడు. దీంతో అది నిజమని నమ్మిన సురేష్ బాబు మేనేజర్ అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత వ్యాక్సిన్ కోసం మేనేజర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కేటుగాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.