- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాబర్ ఇండియా నికర లాభం 6 శాతం క్షీణత!
దిశ, వెబ్‌డెస్క్: 2020 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ మేజర్ డాబర్ ఇండియా నికర లాభం 6.18 శాతం క్షీణించి రూ. 341.30 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 363.81 కోట్ల నికర లాభాలను ఆర్జించడం గమనార్హం. ప్రస్తుత త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 12.90 శాతం తగ్గి రూ. 1,979.98 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది రూ. 2,273.29 కోట్లుగా ఉన్నట్టు డాబర్ ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
లాభాల బాటలో నడుస్తున్న సమయంలో కంపెనీ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, అయినప్పటికీ వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇప్పుడిప్పుడే డాబర్ ఇండియా సాధారణ స్థాయికి చేరుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచిందని, ఈ ఏడాది మొత్తం తమ వ్యాపారం స్థిరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా.
తొలి త్రైమాసికాంలో పరిస్థితులను అనుసరించి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, పరిశుభ్రత విషయంలో వినియోగదారుల అవసరాలను తీరుస్తూ కొత్త ఉత్పత్తులను, వేరియంట్లలో రికార్డు స్థాయిలో మార్కెట్లోకి ప్రవేశపెట్టామని మోహిత్ పేర్కొన్నారు. దీంతో తొలి త్రైమాసికంలో రూ. 100 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ భవిష్యత్తులో ఇలాంటి బ్రాండ్లపై పెట్టుబడులను పెట్టడం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వీటిలో ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ విభాగాంలోనే పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది