- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టుదలతో ముందుకెళితే సాధించనిది ఏమీ లేదు : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
దిశ, కుత్బుల్లాపూర్ : పట్టుదలతో ముందుకెళ్తే సాధించనిది ఏమీలేదని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. హైదరాబాద్ సైకిలిస్ట్ గ్రూప్ వ్యవస్థాపకులు రవిందర్ నందనూరి ఆధ్వర్యంలో నవంబర్ 12వ తేదీన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీనగర్‌లో మొదలైన కే2కే సైకిల్ రైడ్ 23 రోజుల్లో 13 మంది రైడర్లు 13 రాష్ట్రాల మీదుగా 3780 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. అనంతరం ఆదివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రైడర్లను ఆయన అభినందించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైడర్లు మొక్కవోని దీక్షతో రైడ్‌ను పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ అధ్యక్షులు, ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, డా.శ్రీనివాస్, రైడర్లు పాల్గొన్నారు.
అదేవిధంగా కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఇంద్రసింగ్ నగర్ నూతన సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే వివేకానంద్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో భూషణంగౌడ్, అప్పారావు, సతీష్, భాస్కర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.