కేటుగాడు.. ఓటీపీతో రెండు లక్షలు కొట్టేశాడు..

by Anukaran |   ( Updated:2021-09-02 11:07:37.0  )
cyber fraud
X

దిశ, కోదాడ: పట్టణంలోని శ్రీనివాస నగర్ కు చెందిన తాటిపల్లి కృష్ణకాంత్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఓ లింక్ పంపించాడు. ఆ లింక్ ఓపెన్ చేయాలంటూ ఫోన్ చేసి చెప్పడమే కాకుండా.. ఓటీపీ చెప్పమనడంతో కృష్ణకాంత్ చెప్పేశాడు. ఇంకేముంది.. తన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.2,00,500లు మాయమయ్యాయి. వెంటనే కృష్ణకాంత్ తేరుకొని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన తాటిపల్లి కృష్ణకాంత్‌కు హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్ ఇండస్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది.

అయితే గత నెల 31న ఉదయం 09339753978 అనే మొబైల్ నెంబర్ నుండి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఒక లింక్ పంపాడు. అంతేకాకుండా ఆ లింక్ ఓపెన్ చేసిన తరువాత వచ్చిన ఓటీపీతో పాటు మరో రెండు ఓటీపీలను కూడా గుర్తు తెలియని వ్యక్తికి చెప్పాడు కృష్ణకాంత్. దీంతో కృష్ణకాంత్ బ్యాంక్ ఖాతా నుండి రూ. 2 లక్షల 5 వందలు కాజేశాడు. వెంటనే సదరు నెంబర్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో.. కృష్ణకాంత్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ నరసింహరావు చీటింగ్, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ఎవరైనా గుర్తు తెలియని నెంబర్ ల నుండి లింక్ లు పంపిస్తే వాటిని ఓపెన్ చేయవద్దని, అలాగే ఎవరికీ ఓటీపీ లు చెప్పవద్దని వెల్లడించారు.

Advertisement

Next Story