ముడిచమురుపై ఆధారపడటం తగ్గించాలి: అసోచాం

by Harish |
ముడిచమురుపై ఆధారపడటం తగ్గించాలి: అసోచాం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆత్మ నిర్భర్ భారత్ నిజమైన లక్ష్యాలను సాధించేందుకు 15 కీలక రంగాల్లో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు రెట్టింపు చేయాల్సిన అవసరముందని పరిశ్రమల సమాఖ్య అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచాం) తెలిపింది. రాబోయే కొన్నేళ్లలో ఫార్మా, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రిక్ యంత్రాల లాంటి రంగాల్లో భారత్ స్వావలంబన సాధించగలదని పరిశ్రమల సమాఖ్య అభిప్రాయపడింది. రానున్న 2-3 ఏళ్లలో పెట్రోలియం, ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, బొగ్గు, ఇనుము-ఉక్కు, కూరగాయల నూనెల దిగుమతులపై కేంద్రం దృష్టి సారించాలని పేర్కొంది. ‘ముడి చమురుపై ఆధారపడటం తగ్గించేందుకు దీర్ఘకాలిక వ్యూహం కోసం కృషి చేయాల్సిన అవసరముందని పరిశ్రమల సమాఖ్య సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అభిప్రాయపడ్డారు. ఇందులో సామర్థ్యాన్ని పెంచేందుకు ఎక్కువ పెట్టుబడులు పెట్టడమే కాకుండా, అంతర్జాతీయంగా పోటీ ధరల్లో వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేలా చూడాలని దీపక్ భావించారు. నిజమైన స్వావలంబన అంటే వేగవంతమైన ఉత్పత్తి, ధరల వ్యూహమని దీపక్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed