- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Zomato Food Delivery: జొమాటోలో అవి కావాలంటే ఇకపై అడగాల్సిందే!
దిశ,వెబ్‌డెస్క్ : పర్యావరణ పరిరక్షణకు జొమాటో ఫుడ్ డెలివరీ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లలో అత్యధికంగా టిష్యూలు, ప్లాస్టిక్ స్పూన్, ఫోర్క్‌లు వాడటం లేదని, వాటిని పంపించడం వేస్ట్ అని కస్టమర్లు అభిప్రాయపడుతున్నారు. భిన్నాభిప్రాయాల నేపథ్యంలో జొమాటో ఆ వస్తువుల్ని ఆప్షన్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో అవసరం ఉన్న వారు మాత్రమే ప్లాస్టిక్ వస్తువులను పొందగలరు. ఈ చిన్న మార్పుతో రోజుకు 5000 కిలోల ప్లాస్టిక్ వినియోగం తగ్గించొచ్చని జొమాటో తన అధికార ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేసింది.
ఈ క్రమంలో సంవత్సరానికి 2 మిలియన్ కిలోల ప్లాస్టిక్ వినియోగం తగ్గనుంది. ఫుడ్ తినేందుకు వినియోగించే ఒక్క చిన్న ప్లాస్టిక్ స్పూన్ భూమిలో కలిసిపోయేందుకు 200 నుంచి 500 యేళ్లు పడుతుంది. వీటిని తగ్గించడం ద్వారా ఎన్విరాన్మెంట్‌కు కొంతమేర నష్టం జరగకుండా ఉంటుందని భావిస్తున్నట్లు జొమాటో తెలిపింది. జొమాటో తీసుకున్న ఈ వినూత్న ఆలోచనను రెస్టారెంట్లు స్వాగతించాయి. ఈ ప్లాస్టిక్ వస్తువుల వల్ల దాదాపు 3 రూపాయల ఖర్చు అవుతుందని, ఈ ఖర్చును ఇకో ఫ్రెండ్లీ వస్తువులు వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని హోటళ్లకు జొమాటో సూచించింది. అంతేకాకుండా అవసరం లేదని చెప్పినా.. రెస్టారెంట్లు ఆర్డర్‌తో పాటు ఇవి పంపించినా ఫీడ్ బ్యాక్‌లో తెలపాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.