- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జాతీయ-అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్
అంతర్జాతీయం:
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా:
అధికారంలోకి వచ్చాక ఇబ్బందికర పరిస్తితుల్ని ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు.
కేవలం 45 రోజుల్లోనే అధికారం కోల్పోయి కొత్త రికార్డు సృష్టించారు.
సొంత పార్టీలోనే తిరుగుబాటు రావడంతో రాజీనామా చేశారు.
స్వీడన్ ప్రధానిగా ఉల్ఫ్ క్రిస్టెర్ సన్:
స్వీడన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఉల్ఫ్ క్రిస్టెర్ సన్ (59)ను ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకుంది.
కేవలం మూడు ఓట్ల ఆధిక్యంతో (176 -173) ఆయన డెమోక్రాట్లపై విజయం సాధించారు.
మూడు పార్టీల సంయుక్త భాగస్వామ్యంతో ప్రధాని పదవికి పోటీ పడిన క్రిస్టెర్ సన్ సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయారు.
========================
జాతీయం:
మిషన్ లైఫ్ ప్రారంభం:
వాతావరణ మార్పుపై ప్రతి ఇంటిలోనూ చర్చ జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
ఆయన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో కలిసి కేవడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా ప్రతిమ దగ్గర వాతావరణ మార్పులతో కలుగుతున్న వినాశకర ఫలితాల నుంచి భూమిని రక్షించే లక్ష్యం తో తయారు చేసిన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక మిషన్ లైఫ్ ను ప్రారంభించారు.
ఫ్రాన్స్, బ్రిటన్, మాల్దీవులు సహా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు, భారత్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రధాని ప్రకటించారు.
జూన్ లో చంద్రయాన్ - 3 ప్రయోగం: ఇస్రో
చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్ - 3 ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది.
వచ్చే ఏడాది జూన్ లో ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ వెల్లడించారు.
మునుపటితో పోలిస్తే మరింత బలమైన రోవర్‌ను దాని ద్వారా చంద్రుడి పైకి పంపనున్నట్లు తెలిపారు.
భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ ను 2024 చివర్లో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు ఆరు ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.
తొలి అబార్ట్ మిషన్‌ను 2023 తొలినాళ్లలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
దేశీయంగా ఆయుధాల ఉత్పత్తికి యూఏఈ సంస్థతో ఐకామ్ ఒప్పందం:
ఎంఈఐఎల్ గ్రూపు సంస్థ ఐకామ్, యూఏఈలోని ఎడ్జ్ గ్రూపునకు చెందిన క్యారకల్ అనే రక్షణ ఉత్పత్తుల సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడంతో పాటు ఈ డబ్ల్యూ సిస్టమ్స్, ఎలక్ట్రో- ఆప్టిక్స్, షెల్టర్స్, కాంపోజిట్స్, డ్రోన్ టెక్నాలజీ సిస్టమ్స్‌ను ఐకామ్ గ్రూపు అభివృద్ధి చేస్తోంది.
చిన్న ఆయుధాల(స్మాల్ ఆర్మ్) ఉత్పత్తిలో క్యారకల్ నిమగ్నమై ఉంది.
గుజరాత్‌లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్ పో - 2022 లో ఇరుపక్షాలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
భారత రక్షణ సంస్థలకు, అంతర్జాతీయ మార్కెట్‌కు అనువైన చిన్న ఆయుధాలను పూర్తిగా మన దేశంలో ఉత్పత్తి చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ కాక్యక్రమాలతో, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశం ముందుకు సాగుతోందని, ఇందులో తాము భాగస్వామి అవుతున్నట్లు ఐకామ్ చీఫ్ పి. సుమంత్ తెలిపారు.
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ..
గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు, కర్ణాటక సీనియర్ నేత, దళిత కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
దాదాపు 84 శాతం ఓట్లు సాధించి, ప్రత్యర్థి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను ఓడించారు.
అధ్యక్షుడిగా అక్టోబరు 26న బాధ్యతలు స్వీకరించనున్న ఖర్గే 24 ఏళ్ల తర్వాత ఆ పదవిని అధిరోహించనున్న గాంధీ కుటుంబేతర వ్యక్తి కానున్నారు.
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలిగా సీమా ముస్తఫా:
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలిగా ద సిటిజన్ సంపాదకురాలు సీమా ముస్తఫా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా ద కారవాన్ ఎడిటర్ అనంత్ నాథ్, కోశాధికారిగా సకల్ మీడియా గ్రూప్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ పవార్‌లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దిగుమతుల భారం తగ్గింపు దిశగా భారత్:
దేశ అవసరాల కోసం వంట నూనెలు, ఎరువులు, ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సి రావడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
వీటి కోసం భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం వెచ్చించాల్సి వస్తోందని.. ఖజానాపై పెను భారం మోపుతోందని తెలిపారు.
డిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రాంగణంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 16 వేల కోట్లను రైతులకు బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేశారు.
ఓకే దేశం, ఒకే ఎరువు పథకానికి శ్రీకారం చుట్టి భారత్ యూరియా సంచులను విడుదల చేశారు.
ఆరు వందల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించారు.
తొలిసారిగా అల్యూమినియం గూడ్స్ రైలు:
అల్యూమినయంతో తయారైన గూడ్స్ రైలును రైల్వే శాఖ తొలిసారి భువనేశ్వర్ నుంచి నడిపింది.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జెండా ఊపి దీనిని ప్రారంభించారు.
ఉక్కుతో తయారైన రేక్ కన్నా ఇది అతి తేలికగా ఉండటంతో పాటు ఎక్కువ సామాగ్రిని తరలించేదిగా రూపొందించారు.
బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్, హిండాల్కో సంయుక్త భాగస్వామ్యంతో తయారైంది.
ప్రస్తుతమున్న రేక్ కన్నా ఇది 180 టన్నుల తక్కువ బరువు ఉంది.
రేక్ బరువు తక్కువగా ఉండటంతో రైలు వేగం పెరగడంతోపాటు తక్కువ విద్యుత్ వినియోగం అవుతుంది.
వచ్చే ఏడాదిలోగా ఇలాంటి లక్ష వ్యాగన్లను సమకూర్చుకోవాలన్న రైల్వే శాఖ ప్రణాళిక మేరకు కార్యాచరణ చేపట్టామని తయారీ సంస్థ హిండాల్కో వివరించింది.
త్వరలో ప్రయాణికుల రైళ్లకూ ఇలాంటి కంపార్టుమెంట్ల తయారీపై దృష్టి పెట్టామని తెలిపింది.
లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్ భగత్ జ్ఞాపకార్థం యూఎస్ఐ చైర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్:
దివంగత లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్.భగత్ జ్ఞాపకార్థం యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యూస్ఐ)లో చైర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ పాండే ప్రకటించారు.
స్థానిక యూఎస్ఐ ప్రాంగణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
పీ.ఎస్ భగత్ 1918 అక్టోబర్‌లో జన్మించారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రతిష్టాత్మక విక్టోరియా క్రాస్‌ను గెల్చుకున్న తొలి భారతీయ అధికారి ఆయనే..
================================
రాష్ట్రాలు:
ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రంగా యాదాద్రి:
ఢిల్లీలోని భారతీయ హరిత భవనాల మండలి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్ర పురస్కారానికి ఎంపిక చేసింది.
2022- 25 ఏడాదికి గాను దీనిని ప్రకటించి మండలి ప్రతినిధులు యాదాద్రి దేవాలయ ప్రాధికార సంస్థ (వైటీడీఏ) వీసీ కిషన్ రావుకు అందించారు.
పునర్నిర్మాణంలో ఆలయ ప్రాంగణాన్ని కాపాడడం, సుందరీకరణ పనులను చేపట్టడం, ప్రత్యేక సూర్య వాహిక ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ కాంతి ప్రసారం జరిగేలా నిర్మాణం, రద్దీ విపరీతంగా ఉండే సమయాల్లోనూ స్వచ్ఛమైన గాలి నలుదిశలా ప్రసరించేలా వెంటిలేటర్లు, కిటికీల ఏర్పాటు వంటివి పరిశీలించి ఈ పురస్కారం ప్రకటించినట్లు హరిత భవనాల మండలి పేర్కొంది.
గ్రామీణ ద్రవ్యోల్భణం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామాల్లో సెప్టెంబర్ నెలలో అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదైనట్లు ఆర్‌బీఐ నెలవారీ నివేదిక వెల్లడించింది.
గత నెలలో పట్టణ ప్రాంతాల్లో 7.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 7.6 శాతం మేర ద్రవ్యోల్బణం నమోదు కాగా, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్‌లలో మాత్రం 8 శాతం నమోదైనట్లు పేర్కొంది.
వంద కోట్లతో హైదరాబాద్ లో రోష్:
స్విట్జర్లాండ్ కు చెందిన ప్రసిద్ధ ఔషధ, రోగ నిర్ధారణ యంత్రాల తయారీ సంస్థ రోష్ తెలంగాణలో ప్రపంచ స్థాయి అత్యాధునిక విశ్లేషణ, సాంకేతిక ప్రతిభా కేంద్రాన్ని రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
దీని ద్వారా వంద మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
================================
అవార్డులు:
30 మందికి వైఎస్ ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు:
సామాన్యుల్లో ఉన్న అసామాన్యులను సత్కరించాలన్న లక్ష్యంతో వైయస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ప్రభుత్వం అందిస్తోందని సమాచార సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ తెలిపారు.
మొత్తం 20 మందికి జీవిత సాఫల్య పురస్కారాలు, 10 మందికి సాఫల్య పురస్కారాలు అందిస్తారు.
వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థల నుంచి అందిన 428 ప్రతిపాదనలను కమిటీ పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.
వైయస్సార్ జీవిత సాఫల్య పురస్కారం కింద రూ. 10 లక్షలు, సాఫల్య పురస్కారం కింద రూ. 5 లక్షల నగదు అందిస్తారు.
వైయస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు:
కళలు సంస్కృతి విభాగంలో:
కె.విశ్వనాథ్
ఆర్.నారాయణమూర్తి
నాయుడు గోపి
పిచ్చుక శ్రీనివాస్
షేక్ గౌసియా బేగం
సాహిత్య సేవా రంగం:
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
ఎమెస్కో ప్రచురణాలయం
రచయిత శాంతినారాయణ
విద్యారంగం:
మదనపల్లి- రిషి వ్యాలీ
కావలి- జవహర్ భారతి
మనస్తత్వ శాస్త్ర నిపుణుడు బి.వి పట్టాభిరామ్
నంద్యాలకు చెందిన ఉపాధ్యాయుడు దస్తగిరి రెడ్డి.
మీడియా రంగం:
బండారు శ్రీనివాసరావు
సతీష్ చందర్
మంగు రాజగోపాల్
ఎంఈవీ ప్రసాద్ రెడ్డి
వైద్య రంగం:
డాక్టర్ బి.నాగేశ్వరరెడ్డి,
డాక్టర్ ప్రసాదరెడ్డి
డాక్టర్ కృష్ణ ఎల్లా
డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి
డాక్టర్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు
పారిశ్రామిక రంగం:
గ్రంథి మల్లికార్జునరావు