లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 2022

by Harish |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 2022
X

చైనా సరికొత్త కొవిడ్ టీకా:

చైనా నోటి ద్వారా పీల్చే కొవిడ్ టీకాను అభివృద్ధి చేసింది.

ఈ వ్యాక్సిన్‌ను షాంఘై నగరంలో ప్రజలకు అందిస్తున్నారు.

ఈ తరహా టీకా ప్రపంచంలోనే మొదటిది కావడం విశేషం.

ఇప్పటికే కరోనా టీకా తీసుకున్న వారికి దీనిని బూస్టర్ డోసుగా అందిస్తున్నారు.

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్:

బ్రిటన్‌లో భారత సంతతి నేత రిషి సునాక్ చరిత్ర సృష్టించారు.

కింగ్ చార్లెస్ -3 రిషి సునాక్ ను 57వ ప్రధాన మంత్రిగా నియమించారు.

పాలక కన్జర్వేటివ్ పార్టీ అధినాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు.

దీంతో బ్రిటన్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది.

పాలనలో చోటు చేసుకున్న పొరపాట్లను సరిదిద్ది దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించారు.

ఇక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటమే లక్ష్యమని సునాక్ ప్రకటించారు.

తన కేబినెట్ లో భారత సంతతి నాయకురాలు సుయెల్లా బ్రేవర్మన్ కు హోంశాఖను రిషి కేటాయించారు.

రిషి సునాక్ ఘనత:

అతి పిన్న వయసులో (42 ఏళ్లు) ప్రధాని అయ్యారు.

తొలి శ్వేతజాతీయేతర ప్రధాని.

తొలి హిందూ ప్రధాని.

తొలి భారత సంతతి ప్రధాని.



గ్రే లిస్ట్ నుంచి పాకిస్థాన్ తొలగింపు:

అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్‌కు భారీ ఊరట లభించింది.

గ్రే లిస్ట్ నుంచి ఆ దేశాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తొలగించింది.

సింగపూర్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది.

దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం పాకిస్థాన్ కు ఏర్పడింది.

ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడి చేసే లక్ష్యాలను పాకిస్తాన్ అందుకోకపోవడం వల్ల ఎఫ్ ఏటీఎఫ్ నాలుగేళ్ల పాటు ఆదేశాన్ని గ్రే లిస్ట్ లో ఉంచింది.

చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ మూడోసారి ఎన్నిక:

చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ చరిత్ర సృష్టించారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత మరెవరికీ సాధ్యం కాని తరహాలో దేశాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు.

చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) ఛైర్మన్ గానూ జిన్ పింగ్ నియమితులయ్యారు.

దేశంలో అత్యున్నత అధికార కేంద్రాలన్నీ జిన్ పింగ్ చేతుల్లోనే ఉన్నాయి.

=====================

జాతీయం

జేడీ(ఎస్) జాతీయాధ్యక్షునిగా దేవెగౌడ:

జనతాదళ్ (ఎస్) జాతీయాధ్యక్షుడిగా మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ మరోసారి ఎన్నికయ్యారు.

బెంగళూరులో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

1999 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.



బీడీఎల్ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ:

ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది.

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సంగ్రామిక, యాంటీ ట్యాంక్ వెపన్ సిస్టమ్ సంహారిక, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వెపన్ సిస్టం నమూనాలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అందించారు. గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్ పో - 2022లో బీడీఎల్ చైర్మన్, ఎండీ సిద్ధార్థ్ మిశ్రా వీటిని రక్షణ శాఖకు అప్పగించారు.

సంగ్రామిక క్షిపణిని ఎంబీటీ అర్జున్ కు అనుసంధానిస్తారు.

రఫేల్ యుద్ధ విమానాన్ని అందిస్తున్న డసాల్ట్ ఏవియేషన్ తో బీడీఎల్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

బీడీఎల్ ఆయుధాలు అస్త్ర, స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్లను రఫేల్ లో అమర్చుతారు.

అశోక్ లేల్యాండ్ డిఫెన్స్ సిస్టమ్స్, మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్, న్యూ స్పేస్ టెక్నాలజీస్, ఐఐటీ రోపార్ తోనూ బీడీఎల్ ఒప్పందాలు కుదుర్చుకుంది.

జి20 పౌర సమాజ నాయకురాలిగా మాతా అమృతానందమయి:

జీ 20 కూటమిలో పౌరసమాజం తరఫున ప్రాతినిధ్యం వహించే సివిల్ 20 (సి-20)బృందం చైర్ పర్సన్ గా ఆధ్యాత్మిక వేత్త మాతా అమృతానందమయి దేవి (అమ్మ)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది.

ప్రభుత్వేతర, వాణిజ్యేతర అంశాలపై దేశం తరఫున ఆమె మాట్లాడతారు.

జి20 కూటమిలో సివిల్ 20 బృందం ఓ భాగం.

భారతదేశం 2022 డిసెంబరు 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు జి 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుంది.

ఢిల్లీలో 2023 సెప్టెంబర్ 9,10 తేదీల్లో కూటమిలోని దేశాధినేతల సదస్సు జరగనుంది.

===============================

అవార్డులు:

RRR కు ప్రముఖ శాటర్న్ అవార్డు:

అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకిచ్చే ప్రముఖ శాటర్న్ అవార్డు ఈ ఏడాదికి రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా కు లభించింది.

ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ పురస్కారం దక్కించుకుంది.

బాహుబలి - 2 తర్వాత భారతీయ చిత్రానికి వరించిన రెండో శాటర్న్ అవార్డు ఇది.

విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల స్ఫూర్తిగా అల్లుకున్న కల్పిత కథతో రూపొందిన చిత్రమిది.




ఎన్ఆర్ఐ చాపరాల బాబ్జీకి జీవిత సాఫల్య పురస్కారం:

అమెరికాలో ఎన్ఆర్ఐ డాక్టర్ చాపరాల బాబ్జీ (ఏలూరు) జీవిత సాఫల్య పురస్కారం లభించింది.

డాలర్ మేయర్ జాన్ ఎరిక్సన్ ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు.

అమెరికా అభివృద్ధికి వివిధ రంగాల్లో అంకితభావంతో సేవలందించే వారికి అమెరికా అధ్యక్షుడు ఈ అవార్డును ప్రకటిస్తారు.

రిటైర్డ్ సైనికులకు ఉపాధి నైపుణ్యాలు పెంపొందించడంలో, ఐవీలీగ్ విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో సేవలందిస్తున్న బాబ్జీ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు రక్షా మంత్రి అవార్డు:

టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ కు చెందిన అడ్వాన్స్ డ్ లోటరింగ్ సిస్టమ్స్ (ఏఎల్ఎస్ 50), అత్యంత ప్రతిష్టాత్మక రక్షా మంత్రి అవార్డ్ ఫర్ ఎక్స్ లెన్స్ ఇన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్ 2021-22ను సొంతం చేసుకుంది.

పెద్ద కంపెనీల విభాగంలో ఈ అవార్డు దక్కించుకున్నట్లు సంస్థ తెలిపింది.

డిఫెన్స్ ఎక్స్ పో - 2022 లో భాగంగా టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఎండీ, సీఈఓ సుకరన్ సింగ్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.

శ్రీలంక రచయిత షెహాన్ కరుణ తిలకకు బుకర్ ప్రైజ్:

ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2022 ను శ్రీలంక రచయిత షెహాన్ కరుణ తిలక గెలుచుకున్నారు.

ఆయన రెండవ రచన 'ది సెవన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మైదా' పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది.

శ్రీలంకలో చోటు చేసుకున్న క్రూరమైన అంతర్యుద్ధం నేపథ్యం ఆధారంగా ఆ రచన సాగింది.

లండన్ లో జరిగిన కార్యక్రమంలో కరుణ తిలక ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

బుకర్ ప్రైజ్ అందుకున్న శ్రీలంక రచయితల్లో ఆయన రెండో వ్యక్తి.

గతంలో 1992లో 'ది ఇంగ్లిష్ పేషెంట్' పుస్తకానికి మైఖెల్ ఆండాట్జి అందుకున్నారు.

వంద కోట్లతో హైదరాబాద్ లో రోష్:

స్విట్జర్లాండ్ కు చెందిన ప్రసిద్ధ ఔషధ, రోగ నిర్ధారణ యంత్రాల తయారీ సంస్థ రోష్ తెలంగాణలో ప్రపంచ స్థాయి అత్యాధునిక విశ్లేషణ, సాంకేతిక ప్రతిభా కేంద్రాన్ని రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

దీని ద్వారా వంద మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed