రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి

by Shyam |
రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతల స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓరోజు నార్మల్ గా ఉంటే మరో రోజు చలిగాలుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో చలి ఎఫెక్ట్ పెరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 10దాటే వరకు ఎండ తీవ్రత కనిపించడం లేదు. సాయంత్రం 5,6 గంటల నుంచి చలిగాలులతో జనం వణికిపోతున్నారు. హిమాలయల నుంచి చలిగాలు వీస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం కొమ్రంభీమ్ జిల్లాలో 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆదిలాబాద్ జిల్లాలో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత, కామారెడ్డి జిల్లాలో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత, సంగారెడ్డిజిల్లాలో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత, మంచిర్యాలలో 8.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed