KKR టాప్ ఆర్డర్‌ను కూల్చిన CSK బౌలర్లు..

by Anukaran |
KKR టాప్ ఆర్డర్‌ను కూల్చిన CSK బౌలర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసిన విషయం తెలిసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి 10 ఓవర్లలో చెన్నై జట్టుకు చుక్కలు చూపించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51), వెంకటేశ్ అయ్యర్ (50) చెరో అర్థ సెంచరీలతో ధోని సేనను భయం అంటే ఎంటో చూపించారు. అయితే, 10 ఓవర్ల తర్వాత మ్యాచ్ స్వరూపాన్నిసీఎస్కే బౌలర్లు ఒక్కసారిగా మార్చేశారు. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా పట్టుబిగించడంతో కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 15 ఓవర్లలో 120-6 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది. మరో 5 ఓవర్లు కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేస్తే సీఎస్కే జట్టు అవలీలగా విజయం సాధించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed