- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Demonty Colony Part-3: ఆ హారర్ సినిమా పార్ట్ 3.. అఫీషియల్ పోస్ట్‌తో ఆనందంలో నెటిజన్లు

దిశ, సినిమా: అరుల్ నిధి (Arul Nidhi), ప్రియ భవానీ శంకర్ (Priya Bhavani Shankar) జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ (Horror thriller) చిత్రం ‘డీమోంటీ కాలనీ 2’ (Demonty Colony-2). జ్ఞానముత్తు పట్టరై, వైట్‌నైట్స్ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి రాజ్ వర్మ ఎంటర్‌టైన్మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ సుబ్రహ్మణ్యం, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన ఈ చిత్రం ఫస్ట్ తమిళంలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చి ఇక్కడ కూడా సక్సెస్ అందుకుంది.
ఇదిలా ఉంటే.. హారర్ అండ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న డీమోంటీ కాలనీ పార్ట్-త్రీ (Demonty Colony Part-3) కి సంబంధించిన తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. పార్ట్-2 ప్రమోషన్స్ టైమ్‌లో లోనే డీమోంటీ కాలనీ 3 కూడా ఉంటుందని, ఈ మూడో పార్ట్ 2026లో విడుదల అవుతుందని అప్పుడే ప్రకటించిన చిత్ర బృందం తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు. షూటింగ్ పార్ట్ నుంచి ఓ ఫొటో షేర్ చేస్తూ ‘డీమోంటీ కాలనీ 3 వర్క్ జరుగుతోంది’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.