ఫుట్‌పాత్‌పై పిల్లర్‌తో నిర్మాణం.. చోద్యం చూస్తున్న అధికారులు

by Aamani |
ఫుట్‌పాత్‌పై పిల్లర్‌తో నిర్మాణం.. చోద్యం చూస్తున్న అధికారులు
X

దిశ,పరిగి : ఫుట్ పాత్ ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పే మున్సిపల్ అధికారులు మాటలు వట్టివేనని మున్సిపల్ ప్రజలు తప్పుపడుతున్నారు. హైదరాబాద్- బీజాపూర్ 163 ( హైవే పై) జాతీయ రహదారిపై పరిగి లోని బాహార్ పేట్ సమీపంలోని హెచ్ డి ఎఫ్సి బ్యాంక్ ముందు ఫుట్ పాత్ పై ఏకంగా పిల్లర్ వేసి కాంక్రీట్ తో నిర్మాణం చేపడుతున్నారు. ఫుట్ పాత్ పై తాత్కాలికంగా దుకాణదారులు ఆక్రమిస్తేనే నోటీసులు ఇచ్చి జరిమానాలు విధించే మున్సిపల్ అధికారులు పిల్లర్ వేసి కడుతుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ తప్పు పడుతున్నారు. సదరు ఇంటి యజమాని గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా ఉండి ఫుట్ పాత్ ఆక్రమించవద్దని నలుగురికి చెప్పిన వ్యక్తి అని ఇప్పుడు తానే ఇలా పిల్లర్ తో నిర్మాణం చేపట్టడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కో..న్యాయం, మామూలు ప్రజల కో న్యాయమా అంటూ మున్సిపల్ అధికారుల తీరును నిలదీస్తున్నారు. ఫుట్ పాత్ పై పిల్లర్ వేసి చేపడుతున్న నిర్మాణాన్ని కూల్చి వేయాలంటూ ప్రజలు కోరుతున్నారు. పిల్లర్ వేసి అక్కడ ట్రాన్స్ఫార్మర్ దిమ్మె నిర్మిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాగే కనుక మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తే మున్సిపల్ ప్రజలకు, హైవే రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు ప్రమాదం నిర్మించి నట్లే అని అంటున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోరుతున్నారు.



Next Story