- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీకి ఘనమైన వీడ్కోలు?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్-2021 సీజన్ ఎంఎస్ ధోనీ చివరిది కాబోదని చెన్నయ్ సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ చెబుతున్నది. ఇటీవల ధోనీ రిటైర్మెంట్ గురించి సందిగ్దత నెలకొన్నది. స్వయంగా ధోనీనే విభిన్నమైన వ్యాఖ్యలు చేయడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొన్నది. తొలుత ఒక లైవ్ ఇంటర్వ్యూలో.. తాను చేపాక్ స్టేడియంలోనే వీడ్కోలు మ్యాచ్ ఆడతానని ధోనీ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రెండు రోజులకే.. వచ్చే ఏడాది సీఎస్కే తరపున ఆడతానో లేదో తెలియదని అన్నాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్‌తోనే తన అనుబంధం కొనసాగుతుందని.. అయితే తుది జట్టులో ఉంటానో లేదో తెలియదని అన్నాడు. ఇదంతా రినెన్షన్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుందని ధోనీ వ్యాఖ్యానించాడు. తాజాగా ధోనీ వీడ్కోలుపై సీఎస్కే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది ధోనీ ఇండియాలో ఐపీఎల్ తప్పక ఆడతాడని.. సీఎస్కే తరపున చేపాక్ స్టేడియంలో అతడికి వీడ్కోలు మ్యాచ్ ఉంటుందని సమాచారం. ఈ మేరకు సీఎస్కే యాజమాన్యంలోని ఒక కీలక వ్యక్తి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికతో వ్యాఖ్యానించినట్లు ఒక కథనం ప్రచురించారు. కెప్టెన్ ధోనీకి సీఎస్కే వచ్చే ఏడాది ఘనమైన వీడ్కోలు పలుకబోతోందని.. మరో ఏడాది అతడు సీఎస్కేతోనే ఉంటాడని ఆ కథనంలో పేర్కొన్నారు.