అనుమతినిస్తే ఎగిరిపోతామంటున్న CSK, DC జట్లు

by Shiva |
ipl
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరుగనున్నాయి. కాగా, తొలి దశలో 29 మ్యాచ్‌లు జరగ్గా.. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. గత ఏడాది యూఏఈలోనే లీగ్ నిర్వహించినప్పుడు సీఎస్కే జట్టు అందరి కంటే ముందే అక్కడకు చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని అనుకుంటున్నది. ఒక నెల ముందుగానే అగస్టు రెండో వారం నాటికి యూఏఈ వెళ్లాలని చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.

అయితే, ఐపీఎల్ షెడ్యూల్‌పై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, తమకు యూఏఈ వెళ్లడానికి అనుమతులు మంజూరు చేయాలని బీసీసీఐకి ఈ రెండు ఫ్రాంచైజీలు లేఖలు రాశాయి. ఇండియా నుంచి వచ్చే విమానాలపై యూఏఈ జులై 30 వరకు నిషేధం విధించింది. ఆ తర్వాత విమాన రాకపోకలు అనుమతించే అవకాశం ఉండటంతో బీసీసీఐకి ఆ రెండు ఫ్రాంచైజీలు లేఖలు రాసినట్లు తెలుస్తున్నది. అన్ని రకాల అనుమతులు వస్తే అగస్టు 20లోపే ఫ్రాంచైజీలు యూఏఈ చేరుకునే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed