బ‌స్తీ ద‌వాఖాన‌ను సీఎస్ ఆకస్మిక తనిఖీ

by Shyam |
బ‌స్తీ ద‌వాఖాన‌ను సీఎస్ ఆకస్మిక తనిఖీ
X

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: ఆస్ప‌త్రుల్లో వైద్య చికిత్స‌లు పొందుతున్న రోగుల ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్ లైన్‌లో న‌మోదు చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. ఆసిఫ్ న‌గ‌ర్ మాంగార్ బ‌స్తీలోని బ‌స్తీ ద‌వాఖాన‌ను శనివారం ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… బ‌స్తీ ద‌వాఖాన‌ల్లో అంద‌జేస్తున్న మందుల నిల్వ ఆన్ లైన్‌లో న‌మోదు చేయ‌డం మూలంగా ఎంత మేరకు మందులు అందుబాటులో ఉన్నాయో తెలుస్తాయ‌న్నారు.

ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల‌కు పేద ప్ర‌జ‌లు అధికంగా వ‌స్తుంటార‌ని, వారికి వైద్య సేవ‌లందించేందుకు ఆదివారం కూడా తెర‌చి ఉంచాల‌ని అన్నారు . ఆ రోజున విధులు నిర్వ‌హించిన వైద్యులు,సిబ్బంది ఇత‌ర ఏ రోజులో నైనా సెల‌వు తీసుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వీని ఆయన ఆదేశించారు. బ‌స్తీ ద‌వాఖాన‌లో రోగుల‌కు అందుతున్న సేవ‌ల ప‌ట్ల ఆయ‌న సంతృప్తి వ్య‌క్తం చేశారు. వైద్యులు, సిబ్బంది మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేయాల‌ని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed