అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ కీలక ఆదేశాలు

by Anukaran |
cs-somesh-kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయ రహదారుల కింద రాష్ట్రానికి ఈ ఏడాది మంజూరు చేసిన రహదారుల నిర్మాణ పనులకు అంచనాలను త్వరగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎస్ భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్, అటవీ అనుమతులకు సంబంధించిన అంశాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ ఏడాది మంజూరు చేసిన అన్ని పనులు పూర్తయ్యేలా సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి సమావేశాలు కలెక్టర్లు నిర్వహించాలన్నారు. ఇదిలా ఉండగా నాయీ బ్రాహ్మణులు, వాషర్ మెన్ కమ్యూనిటీలకు ఉచిత విద్యుత్ పథకం పురోగతిపై, అదేవిధంగా ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలల నిర్మాణాల అంశాలపై కూడా సీఎస్ సమీక్షించారు. ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ శోభ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రవి ప్రసాద్, ఎస్ఏసీడీడీ కార్యదర్శి రాహుల్ బొజ్జ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story