పంపిణీ వేగవంతం చేయాలి….

by Shyam |
పంపిణీ వేగవంతం చేయాలి….
X

దిశ, వెబ్ డెస్క్: వరద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీని వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. వరద బాధితులకు ఆర్థిక సాయం పంపిణీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఆర్థిక సాయాన్ని త్వరగా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలనీ, అందుకోసం బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300, నగర శివారులోని మున్సిపాలిటీల్లో 50 బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ, సీడీఎంఏ ఆఫీసులల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరం అనుకుంటే జిల్లాల నుంచి అధికారులను సమకూర్చుకోవాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed