రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ జవాన్ మృతి

దిశ, ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక సీఐ వివరాల ప్రకారం.. యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్ గుర్రం కృష్ణా రెడ్డి(61) బైక్‌పై ఆంధ్రబ్యాంక్ ఎదుట రోడ్డు దాటుతుండగా ఇబ్రహీంపట్నం నుంచి సాగర్ రహదారి వైపు వెళుతున్న కారు బైక్‌ను ఢీ కొట్టింది.

దీంతో బైక్‌పై వెళుతున్న కృష్ణ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయడని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంపై మృతుడు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement