Gulab Cyclone : ఎఫెక్ట్.. రైతు కంట కన్నీరు

by Aamani |   ( Updated:2021-09-28 06:53:53.0  )
Gulab Cyclone : ఎఫెక్ట్.. రైతు కంట కన్నీరు
X

దిశ,నందిపేట్: ఆరుగాలం పండించిన పంట చేతికివచ్చే సమయంలో తుఫాన్ ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. నందిపేట్ మండలం‌లో అన్ని గ్రామాలలో, ఆర్మూర్ ప్రాంతంలోని చాలా చోట్ల గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వరి నేలకు ఒరిగింది. దీని ప్రభావంతో వరి ధాన్యం పాలు పోసుకునే సమయం కావున, గింజలు తరుగు పోయే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో కాటుక వంటి తెగులు సోకుతుంది. అంతే కాకుండా గులాబ్ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది, దీంతో రైతులు వరి పంట పై దిగుబడి తగ్గుతుందని ఆవేదన చెందుతున్నారు.

వర్షానికి తడిసిన సొయా,మొక్కజొన్న

వర్షం ప్రభావానికి కళ్లాలలో సోయాబీన్, మొక్కజొన్న, తడిసిపోయింది. ఎన్నడూ లేనంతగా సొయా బీన్ కు మార్కెట్‌లో 6000 నుండి 7000మధ్య ధర ఉంది. దీంతో రైతులు ఆనందంగా సోయాబీన్ ఆరబోసి అమ్మే లోపే వరుణుడి రూపంలో బాధను మిగిల్చింది. మక్కలు వర్షంతో తడిసిపోతే నల్ల బూజు ఫంగస్ వచ్చే అవకాశముంది. పంట చేతికివచ్చే సమయంలో వర్షం పడడం తీవ్ర బాధను కలిగిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తుపాన్ ప్రభావంతో వరి చాలా చోట్ల నేలకు ఒరిగింది రైతులు పొలంలో నీరు నిల్వ లేకుండా చూడాలి, నీరు నిల్వ ఉంటే ధాన్యం రంగు మరే అవకాశం ఉంది నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిస్తాం.

సాయి కృష్ణ మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి,నందిపేట్

Advertisement

Next Story

Most Viewed