- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డబుల్ మర్డర్ నిందితుల అరెస్టు
దిశ, క్రైమ్ బ్యూరో: ఈ నెల 5వ తేదీన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న జంట హత్యల నిందితులను సోమవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అదే రోజు మరో ఇద్దరు హత్యలకు గురికావడంతో ఒకేరోజు నాలుగు మర్డర్లతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో షేక్ మహమ్మద్ అహ్మద్, సయ్యద్ ఫయాజుద్దీన్‌లు మరణించారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, వెస్ట్‌జోన్ పోలీసులు తెల్లారేసరికి 5 గురు నిందితులను పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితులు అహ్మద్ అలీ ఖాన్, షేక్ హషమ్, మహ్మద్ షాయ్బాజ్, అబ్దుల్ సమద్, మహమ్మద్ అక్బరుద్దీన్‌లను అరెస్టు చేశారు. మహహ్మద్ సయీద్, జుబాయిర్, అక్రమ్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 3 కొబ్బరి బొండాల కత్తులు, 1 డాగర్, గొడ్డలితో పాటు టూ వీలర్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. 24గంటల్లో నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు పి.రాధాకృణ రావు, బి.గట్టుమల్లు, కె.శ్రీనివాస్, ఇతర సిబ్బందిని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అభినందించారు.