పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక యువతీ ఆత్మహత్య

by Aamani |
పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక యువతీ ఆత్మహత్య
X

దిశ,కోరుట్ల టౌన్ : ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట కాలనీ శుక్రవారం జరిగింది. ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రవి-రాజకుమారి దంపతుల కూతురు రుచిత (19) అనే యువతికి తల్లిదండ్రులు పెండ్లి చేయడం కోసం సంబంధాలు చూస్తున్నారు. కాగా ఇటీవల చుసిన సంబంధం విషయమై తల్లిదండ్రులు ఆమెతో విచారించగా ఆమె ఏమి సమాధానం ఇవ్వక పొగ,పెండ్లి చేసుకోవడం ఇష్టం లేక తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన క్రమంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.



Next Story