Crime News: ముగ్గురి ప్రాణాలు బలిగొన్న ఈత సరదా

by Aamani |   ( Updated:2024-07-17 15:32:07.0  )
Crime News: ముగ్గురి ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
X

దిశ,తిరుమలాయపాలెం: ఈతరాకపోయిన సరదాకోసం నీటిలో దిగిన యువతిని కాపడబోయే, ఆ యువతి తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జూపెడ గ్రామానికి చెందిన శ్రీ పాల్ రెడ్డి (45). శ్రీపాల్ రెడ్డి కుటుంబంతో పాటు, అతని స్నేహితుడు, అశ్వరావు పేటకు చెందిన శ్యాంల రాజు రెడ్డి (48). బుధవారం ఏకాదశి పండుగ సందర్భంగా,ఈ రెండు కుటుంబాలు కలిసి సూర్యాపేట బొప్పారం గ్రామంలో శ్రీ పాల్ రెడ్డి అత్తగారి ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం సమీపంలో ఉన్న ఓ గ్రానైట్ క్వారీలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు.

శ్రీ పాల్ రెడ్డి తనయుడు చేతన్ గ్రానైట్ క్వారీలో ఈత కొడుతుండగా, శ్యాంల రాజు కుమార్తె ఉష (12), సరదాగా ఒడ్డున ఈత కొట్టేందుకు వెళ్తూ..కాలు జారీ క్వారీలో పడిపోయింది. గమనించిన తండ్రి శ్యాంల రాజు ఉషా ను కాపాడబోయి,అతడు నీటిలో పడిపోయాడు.ఆ ఇద్దరిని కాపాడే క్రమంలో శ్రీ పాల్ రెడ్డి, నీటిలో పడిపోయాడు. నీటిలో పడిపోయిన ఈ ముగ్గురికి ఈత రాకపోవడంతో క్వారీలో నీటి లోతు ఎక్కువ ఉండడం వల్ల, ముగురు నీట మునిగి మరణించారు.సాయంత్రం శ్రీపాల్ రెడ్డి స్వగ్రామమైన జూపెడ గ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Next Story