- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దారుణం: ఇన్‌స్టాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని భార్యని హత్య చేసిన భర్త
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాంలో యువత, పెళ్లైన మహిళలు ఎక్కువగా ఇన్‌గ్రా వేదికగా వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగానే ఓ మహిళ ఫేమస్ అయ్యేందుకు ఇన్‌స్టాలో వీడియోలు చేస్తూ ఉండేది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ కూడా పెరిగారు. ఇది నచ్చని భర్త ఆమెను హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
నగరానికి చెందిన ఓ వ్యాపార వేత్త.. తన భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. తన భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవారు. అంతే కాకుండా తన ఇన్‌స్టాలో భర్తను బ్లాక్ చేసింది. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎవరితోనో ఎఫైర్ పెట్టుకుంది. అందుకే తనను బ్లాక్ చేసిందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తలు ఇద్దరి మధ్య అనేక గొడవలు వచ్చేవి.
ఆదివారం పిల్లలతో కలిసి కారులో బయటకు వెళ్తుండగా మరోసారి వారి మధ్య గొడవ జరిగింది. దీంతో పిల్లల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం కారు లాక్ చేసి లోపలే ఉండిపోయాడు. వారిపై అనుమానం వచ్చి పెట్రోలింగ్ బృందం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. హత్య విషయం బయటపడింది. ఈ ఘటనపై కొడుకు, కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.