Theft : కందిలో వరుస చోరీలు.. పనిచేయని సీసీ కెమెరాలు

by Aamani |
Theft : కందిలో వరుస చోరీలు.. పనిచేయని సీసీ కెమెరాలు
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : కంది మండల కేంద్రంలో నెల రోజుల వ్యవధిలోనే రెండు చోరీలు జరిగాయి. అంతకు ముందు కూడా తాళం వేసిన ఇంట్లో ఒక చోరీ జరిగింది. తాజాగా ఈ నెల 25వ తేదీ తెల్లవారుజామున పాత కందిలో సాండ్ర కుమార్ అనే యువకుడు కి చెందిన ఆర్15 బైకును ఇంటి ముందు పార్కు చేసి ఉండగా దొంగలు ఎత్తుకెళ్లారు. బైక్ ను చోరీ చేస్తున్న దృశ్యాలు పక్కనే ఉన్న ఇంట్లో నీ సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. అలాగే ఇదే నెల 10వ తేదీన రాములు అనే వ్యక్తి ఇంట్లో తాళం వేసి ఉండటంతో దొంగలు పడి 30 తులాల వెండి, అర తులం బంగారం ను దోచుకెళ్ళారు. అదే పక్కింట్లో కొద్దిరోజుల క్రితం ఇలాగే దొంగలు పడి కొంత నగదు డబ్బును ఎత్తుకెళ్లారు. నెల రోజుల వ్యవధిలోనే వరుస చోరీలు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కంది గ్రామంలో గతంలో పోలీసుల, పంచాయతీ పాలకవర్గ సహాయంతో 34 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అందులో ప్రస్తుతం చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వెంటనే పోలీసులు స్పందించి అన్ని సీసీ కెమెరాలు పనిచేసేలా చూసి, చోరీలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read More..

good thief : దొంగల్లో ఈ దొంగ వేయరా...!



Next Story