- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Drugs కేసులో Tollywood Hero కు నోటీసులు

దిశ, వెబ్‌డెస్క్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యువ హీరో నవదీప్‌కు నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరు కావాలని గురువారం జారీ నోటీసుల్లో పేర్కొంది. 41A కింద నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, టాలీవుడ్‌ను మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారం షేక్ చేస్తోంది. వరుసగా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతుండడంతో ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులు వెలుగు చూడటం ఇదేం కొత్త కాదు.
గతంలోనూ పలు సందర్భాల్లో సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కొందరు డ్రగ్స్ పెడ్లర్లుగా మారి అమ్ముతున్నట్లూ తేలింది. గత కొన్ని నెలలుగా ఈ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ మధ్య నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేయడంతో మరోసారి టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఎంతోమంది స్టార్లు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయం తెల్సిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో పోలీసులు హీరో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి : Airport లో Sruthi Hassan వెంటపడిన గుర్తుతెలియని వ్యక్తి.. భయంతో పరుగులు..