- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ధర్మపురి జిల్లా జాతీయ రహదారిపై ఉన్న అల్వాయ్ బ్రిడ్జిపై ఓ లారీ అదుపుతప్పి ముందున్న మరో రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ బ్రిడ్జిపై నుండి కిందపడి పోగా.. మరో లారీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవ దహనం అయ్యారు. రెండు లారీల మధ్య చిక్కుకుని ఓ కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఫ్లైఓవర్ పై నుండి కింద పడ్డ లారీ కింద 20 మంది చిక్కుకున్ననట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటలు, క్షతగాత్రుల అర్తనాదాలతో ఘటన స్థలం భయంకరంగా మారింది. బ్రిడ్జిపైనే రెండు లారీలు దగ్ధం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.