- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Suicide : డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. తన మాట తల్లిదండ్రులు వినలేదనే..!

దిశ, చేగుంట : క్షణికావేశంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు సెల్ ఫోన్ కోనివ్వలేదని మనస్థాపం చెంది ప్రాణాలు తీసుకుంది. డిగ్రీ చదువుతున్న కూతురు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చేగుంట మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ బాలరాజు విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మాపూర్ గ్రామానికి చెందిన రుచిత(18) మెదక్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. చదువు కోసం రుక్మాపూర్ నుంచి మెదక్ వెళ్లిరావడానికి ఇబ్బంది అవుతుందని అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటానని తెలిపింది. ఇంటికి దూరంగా ఉంటుంన్నందున మొబైల్ ఇప్పించాలని తల్లిదండ్రులను కోరింది. డబ్బులకు ఇబ్బంది ఉందని కొన్ని రోజుల తర్వాత సెల్ ఫోన్ కోనిస్తామని రుచితకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. కానీ మనస్థాపం చెందిన రుచిత సోమవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బాలరాజు తెలిపారు.
Read More..
Family members killed: ఇద్దరు చిన్నారులతో సహా కుటుంబ సభ్యుల హత్య..హర్యానాలో ఓ మాజీ జవాన్ ఘాతుకం