BREAKING : మొయినాబాద్ మర్డర్ కేసు కీలక మలుపు.. చివరికి అలా తేల్చేసిన పోలీసులు

by Shiva |   ( Updated:2024-01-12 11:46:39.0  )
BREAKING : మొయినాబాద్ మర్డర్ కేసు కీలక మలుపు.. చివరికి అలా తేల్చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: మొయినాబాద్ యువతి మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఘటన స్థలంలో దొరికిన ఆధారాల మేరకు ఈ నెల 8న తప్పిపోయిన మృతురాలు మల్లెపల్లి ప్రాంతానికి చెందిన తైసిన్‌‌ బేగం(22)గా గుర్తించారు. అయితే, ఆత్మహత్యకు ముందు తైసిన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వ్యక్తిగత కారణాల, కుటుంబ కలహాల నేపథ్యంలో తైసిన్ ఒంటరిగా మల్లెపల్లి నుంచి వచ్చి మొయినాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈనెల 8న నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో దహనమవుతోన్న ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. ముందు ఎవరై యువతిని మర్డర్ చేశారా.. అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story