- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ చాక్లెట్ తింటే 7 గంటలు మత్తు గ్యారెంటీ.. బిహారీల నయా స్మగ్లింగ్
దిశ, రాచకొండ : స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. పోలీసుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ రోజుకో రూపంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీసుల దాడుల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గంజాయిని నేరుగా విక్రయించినా.., సిగరేట్ రూపంలో అమ్మినా పోలీసులు గుర్తిస్తున్నారని చాక్లెట్ రూపంలో బిజినెస్ స్టార్ట్ చేశారు. మహా ఖాల్ - మున్నక వటి చాక్లెట్ తింటే 7 గంటలు మత్తు గ్యారంటీ అంటూ గంజాయి స్మగ్లర్‌లు మత్తు బాబులను ఆకట్టుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేకంగా గంజాయి చాక్లెట్‌ను తయారు చేసి హైదరాబాద్‌లో అమ్ముతున్నారు బిహార్‌కు చెందిన స్మగ్లర్లు. 5 గ్రాముల చాక్లెట్ ధర 200 రూపాయలకు విక్రయిస్తూ యువతను మత్తులోకి దింపుతున్నారు. ఈ గంజాయి చాక్లెట్ వల్ల ఎవరికీ అనుమానం రాదని, ఎవరు గుర్తించలేరని, గంజాయి సిగరెట్ అయితే వాసన రావడంతో పాటు అందరికీ కనపడుతుందని చెప్పి మత్తు బాబులను గంజాయి చాక్లెట్ వైపు మళ్లీస్తున్నారని తెలిసింది. తాజాగా బిహార్ నుంచి దీపక్ 70 గంజాయి చాక్లెట్‌లను తయారు చేసుకుని వాటిని నాగోల్ ప్రాంతంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎల్‌బీ నగర్ ఎస్ఓటీ బృందం అతడిని అరెస్టు చేసి 70 గంజాయి చాక్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.