BIG BREAKING: శంషాబాద్‌లో పోలీసుల తనిఖీలు.. 800 కిలోల గంజాయి స్వాధీనం

by Shiva |   ( Updated:2024-08-04 06:24:04.0  )
BIG BREAKING: శంషాబాద్‌లో పోలీసుల తనిఖీలు.. 800 కిలోల గంజాయి స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్/క్రైమ్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్‌ హ్యాండెడ్‌గా ఎవరు పట్టుబడినా.. వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలంటూ పోలీసు శాఖకు ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ, ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ పరిధిలోని శంషాబాద్‌లో బాలనగర్ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు.

అయితే, ఓ కంటైనర్ మీద అనుమానం వచ్చి ఆపి చెక్ చేయగా.. పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. రసాయనాల డ్రమ్ముల మాటున మొత్తం 800 కిలోల గంజాయిని కంటైనర్‌లో వారు గుర్తించారు. ఒడిశా నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు ముఠా గంజాయిని తీరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి డీసీఎం డ్రైవర్‌తో సంజీవ్, విఠల్ రెడ్డి, హోల్లప్ప, సప్లయర్ సునీల్ ఖోస్లా, జాగ సునాలను అరెస్ట్ చేశారు. పట్టుబడిన సరుకు విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2.94 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అరకుకు చెందిన మెయిన్ పెడ్లర్ రాము పరారీలో ఉన్నాడు. అతడే పెద్ద మొత్తంలో గంజాయిని ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తుంటాడని, కమీషన్ ఎజెంట్ కం ట్రాన్స్‌పోర్టర్‌గా ఒడిశాకి చెందిన సోమ్‌నాథ్ ఖారా పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed