అప్పటి వరకు బాగానే ఉన్న యువతి..అంతలోనే ఆత్మహత్య

by Sridhar Babu |   ( Updated:2024-08-03 14:40:23.0  )
అప్పటి వరకు బాగానే ఉన్న యువతి..అంతలోనే  ఆత్మహత్య
X

దిశ ,చైతన్య పురి : అప్పటి వరకు బాగానే ఉన్న యువతి...అంతలోనే ఆత్మహత్య చేసుకుంది. ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మారుతీనగర్ లోని మారుతి హోమ్స్ లో నివసించే ఎల్. లాలస చందన (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎన్ఐటీలో సీటు కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలో శనివారం తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. తన

తండ్రి ఆర్టీసీ ఉద్యోగి కావడంతో విధులకు వెళ్లాడు. తల్లి గమనించి రూమ్ తలుపు తెరవమని అరవగా ఎంతకీ తెరవకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే కుమార్తె మృతి చెందింది. వెంటనే తల్లి 100 కు డయల్ చేయగా సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed