ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి..

by Sumithra |   ( Updated:2024-07-17 13:35:56.0  )
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి..
X

దిశ, బాల్కొండ : బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో బుధవారం పొలం పనులు నిర్వహిస్తున్న వేళ ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బ్రహ్మ పృథ్విరాజ్ (సన్నీ) (21) యువకుడు ట్రాక్టర్ నడిపిస్తున్నాడు. అదే క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడటంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కాగా స్థానికులు మృతదేహాన్ని బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed