- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెక్స్ వర్కర్‌తో ఇద్దరు యువకుల ప్రేమాయణం.. కారులోనే కథ ముగించేశారుగా..!
దిశ, వెబ్‌డెస్క్ : సెక్స్ వర్కర్‌తో ఇద్దరు యువకులు చేసిన ప్రేమాయణం ఒకరి ప్రాణాలను తీసింది. ఓ యువకుడిని ప్రేమించిన ఆమె.. మరో యువకుడితో కలిసి జల్సాలు చేస్తుండటంతో ఆగ్రహించిన ప్రియుడు ఆమె రెండు ప్రియుడిపై బుల్లెట్ల వర్షం కురిపించి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం..
మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సౌర్‌లోని భావ్‌ఘర్ ప్రాంతంలో ఓ ఎర్రటి కారు అనుమానస్పదంగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన వెళ్లిన పోలీసులకు కారులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. యువకుడి శరీరం పూర్తిగా రక్తసిక్తమై.. కారులో నుంచి రక్తం కారుతోంది. అతడి శరీరంలోకి 4 బుల్లెట్లు దిగినట్టు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిందని భావించిన పోలీసులు అతడికి వచ్చిన ఫోన్ కాల్స్ లిస్ట్ ఆధారంగా హతుడు రత్లాం డివిజన్ జూనియర్ ఇంజనీర్ దీక్షాత్ పాండ్యా (27)గా గుర్తించారు. వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్యకు రెండు రోజుల ముందు నుంచి వచ్చిన కాల్స్ ఆధారంగా అది హత్య అని.. దీనిలో ఓ యువతీ, యువకుడి పాత్ర ఉందని పోలీసులు అంచనాకు వచ్చారు.
హత్యకు కారణం ఇదే..
సెక్స్ వర్కర్‌గా ఉన్న యువతి మొదట మోహిసిన్ అనే యువకుడిని ప్రేమించింది. ఆ తర్వాత అతడిని పక్కన పెట్టి ఇటీవల దీక్షాత్‌తో ప్రేమలో పడింది. ఈ కొత్త లవర్స్ ఇద్దరు కలిసి తిరగడం ప్రారంభించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం సెక్స్ వర్కర్ రెండో ప్రియుడితో కలిసి నీముచ్ నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని జెట్‌పురాలో జరుగుతున్న వివాహానికి వెళ్లారు. పెళ్లిలో సెక్స్ వర్కర్‌ని మోహిసిన్ ఫ్రెండ్స్ గుర్తించి అతడికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన మోహిసిన్ సెక్స్ వర్కర్‌కు ఆగకుండా ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించాడు. దీంతో కంగారు పడిన ఆమె వెంటనే దీక్షాత్‌తో కలిసి వివాహ వేడుక నుంచి బయటకు వచ్చి కారులో తిరిగి వెళ్లిపోయారు. అయినా మోహిసిన్ కాల్స్ చేయడం ఆపలేదు.
తుపాకీతో కాల్పులు..
మోహిసిన్ కాల్స్‌కు విసుగు చెందిన దీక్షాత్.. సెక్స్ వర్కర్ చేతి నుంచి ఫోన్‌ను తీసుకుని లిఫ్ట్ చేశాడు. వెంటనే ఆ అమ్మాయి ఎక్కడ అని మొహసిన్ అడిగాడు. ఆమెతో నీకేం సంబంధం అంటూ దీక్షాత్ సమాధానం ఇచ్చాడు. దీంతో తాజా, మాజీ ప్రియుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆ అమ్మాయి నా దగ్గరే ఉంది..? నాతోనే ఉంటుంది..? నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దీక్షాత్ కోపంతో ఊగిపోయాడు. అయితే నీకు ధైర్యం ఉంటే నేను ఉన్న ప్రాంతానికి ఆమెను తీసుకురావాలని మోహిసిన్ సవాల్ విసిరాడు. కోపంలో ఉన్న దీక్షాత్ సెక్స్ వర్కర్‌ను తీసుకోని అతడు చెప్పిన మాంద్‌సౌర్‌లోని భావ్‌ఘర్‌కు వెళ్లాడు.
అప్పటికే ఆగ్రహంతో ఉన్న మోహిసన్ వారిద్దరు కారులో రాగానే దీక్షాత్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన దీక్షాత్ కారులోనే ప్రాణాలు వదిలాడు. తన రెండో ప్రియుడు హత్యకు గురికావడంతో సెక్స్ వర్కర్ సైతం అక్కడి నుంచి పరారీ అయింది. ఫోన్ లోకేషన్ ఆధారంగా సెక్స్ వర్కర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాల్పులు జరిపిన ఆమె మొదటి ప్రియుడు మోహిసిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.