- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దారుణం.. కన్న కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి

X
దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని నందివడ్డేమానుపల్లిలో కొన్న కొడుకు శివను తండ్రి నాగయ్య కత్తితో కిరాతకంగా పొడిచి హత్యచేశాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం సమయంలో చోటుచేసుకుంది. అయితే, తల్లిదండ్రులు గొడవ పడుతుండటంతో కుమారుడు శివ అడ్డుపడ్డారు. దీంతో ఆగ్రహానికి నాగయ్య అడ్డొచ్చిన కొడుకును పొడిచాడు.
దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో శివ అక్కడికక్కడే కుప్పకూలాడు. భయాందోళనకు గురైన తల్లి, స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం తండ్రి నాగయ్యను అదుపుకొని తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story