- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిన యువకులు

దిశ, మెట్ పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కొందరు యువకులు గంజాయి తాగుతూ పట్టుపడ్డారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శాంతినగర్ కాలనీ ఇంట్లో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ కిరణ్ కుమార్ తో కలిసి దాడులు నిర్వహించి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా బీహార్ రాష్ట్రానికి చెందిన రూపేష్ కుమార్, సునీల్ కుమార్, సంతోష్ కుమార్, చోటు కుమారులు అని నిర్ధారణ చేశామన్నారు.
వీరు పట్టణంలోని హమాలి పని చేస్తూ శాంతినగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ బీహార్ రాష్ట్రం నుంచి గంజాయిని ఇక్కడికి తీసుకువచ్చి మెట్ పల్లి, మల్లాపూర్ మండలాల పరిసర గ్రామాలకు 500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముతున్నారు. నిందితుల నుంచి ఈ దాడుల్లో 450 గ్రాముల గంజాయి, ఓ మినీ గూడ్స్ వ్యాన్, 4 సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. గంజాయి ముఠాను పట్టించిన శాంతినగర్ కాలనీవాసులకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా గంజాయి అమ్మినా కొన్నా సమాచారాన్ని ఇవ్వాలని సీఐ నిరంజన్ రెడ్డి కోరారు.
Read Also..