- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బార్‌లో సినిమా షూటింగ్‌ను తలపించిన ఎటాక్.. యువకుడిపై బీర్ సీసాలతో దాడి

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా (Manchryala District) బెల్లంపల్లి (Bellampally) కాల్ టేక్స్ బార్ అండ్ రెస్టారెంట్(Call Takes Bar and Restaurant)లో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో కొందరు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిపై బీరు సీసా(Beer bottles)లతో దాడి చేసి బార్‌లో బీభత్సం సృష్టించడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ(Bellampally Two Town SI) మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన అల్లి సాగర్ అతని స్నేహితులు కాల్ టిక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఓ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవిస్తున్నారు. అదే బార్‌లో తాండూర్(Thandoor)కు చెందిన బండారి వంశీ కూడా అక్కడే మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో గొడవ జరిగింది. అల్లి సాగర్ ఆయన అనుచరులు బీర్ సీసాలు పగలగొట్టి బండారు వంశీ పై దాడి చేశారు. ఈ సంఘటనలో బండారి వంశీకి తీవ్ర గాయాలు గాయాలయ్యాయి. గాయపడిన ఆయనను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి(Bellampally Government Hospital)కి తరలించారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనను సృష్టించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.