ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య..

by Sumithra |
ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య..
X

దిశ, అలంపూర్ టౌన్ : అలంపూర్ పట్టణంలో హిరన్మయి (21)అనే యువతి శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై కథనం మేరకు జోగులాంబ ఆలయంలో విధులు నిర్వహించే అర్చకుడు శ్రీనివాస్ శర్మ కూతురు హిరణ్మయి తిరుపతిలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు ఇద్దరు విధులకు వెళ్లి తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చి చూడగా కూతురు హిరణ్మయి ఇంట్లో లుంగీతో ఉరివేసుకొని కనబడింది వెంటనే ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లుగా డాక్టర్ నిర్ధారించారు.

మృతురాలు హిరణ్మయికి మే నెలలో వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. మృతురాలికి అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుండేదని ఆ బాధ భరించలేకనో లేక తాము నిశ్చయించిన పెళ్లి సంబంధం ఇష్టం లేకనో మరే కారణంతోనో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతురాలు తండ్రి శ్రీనివాస శర్మ ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story