వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

by Javid Pasha |   ( Updated:2023-04-16 15:25:55.0  )
వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. భాస్కర్ రెడ్డితోపాటు ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంలో భాస్కర్‌రెడ్డి సోదరుడు మనోహర్‌రెడ్డి లోపలికి వచ్చేందుకు ప్రశ్నించగా అందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. సుమారు ఇంట్లోనే రెండు గంటలపాటు భాస్కర్ రెడ్డిని విచారించారు. అనంతరం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు సంబంధించి మెమోను సతీమణి లక్ష్మికి పి.జనార్థన్ రెడ్డికి అందజేశారు. భాస్కర్ రెడ్డిపై 130బీ, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. భాస్కర్ రెడ్డిని అధికారులు కడపకు తరలించారు. అనంతరం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సీబీఐ మేజిస్ట్రేట్ ముందు ఇవాళ సాయంత్రం అధికారులు హాజరుపరచనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటికి సైతం సీబీఐ చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివేకా హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.

కీలక మలుపు

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఇంటికి సీబీఐ బృందం చేరుకుంది. రెండు 2 వాహనాల్లో 15 మందికిపైగా అధికారులు అక్కడి చేరుకున్నారు. వివేకా హత్యకేసు విచారణలో భాగంగా రెండు రోజుల క్రితం ఎంపీ అవినాశ్​ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్​ కుమార్​ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ అనంతరం ఆదివారం తెల్లవారుజామున పోలీసులు పులివెందులోని ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించింది. విచారణ అనంతరం భాస్కర్ రెడ్డిని అలాగే ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే భాస్కర్‌రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు, వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. అయితే పోలీసులు భారీగా మోహరించి క్లియర్ చేయడంతో భాస్కర్ రెడ్డిని తరలించారు. ఇకపోతే వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సీబీఐ ఇప్పటికే ఎంపీ అవినాశ్ రెడ్డిని నాలుగుసార్లు విచారించింది. అలాగే భాస్కర్ రెడ్డిని సైతం పలుమార్లు విచారించింది. అయితే వీరిద్దరిని సీబీఐ అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

పూలఅంగళ్లులో నిరసన

ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయన నివాసానికి వైసీపీ కార్యకర్తలు అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ భాస్కర్ రెడ్డి తరలింపునకు నిరసనకు దిగారు. అయితే పోలీసులు భారీగా మోహరించడంతో భాస్కర్ రెడ్డిని సీబీఐ బృందం అక్కడ నుంచి తరలించింది. ఇకపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా పులివెందులలోని పూల అంగళ్లు, దుకాణాలను మూసివేశారు వైఎస్ భాస్కర్ రెడ్డి అనుచరులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. మరోవైపు వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా నిరసనగా పులివెందులలో నిరసనలకు వైసీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు పిలుపునిచ్చారు. పులివెందులలోని పూల అంగళ్లు సర్కిల్‌లో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారు. సురేశ్ బాబు పిలుపు మేరకు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు పూల అంగళ్లుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పార్టీనేతలు చేరుకుని నిరసనలు తెలియజేశారు.

ఎంపీ అవినాశ్ ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్

ఇదిలా ఉంటే కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అవినాశ్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ బృందం ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఎలాంటి సీబీఐ అధికారులు ఇక్కడకి రాలేదు అని చెప్తున్నట్లు సమాచారం. ఎంపీ అవినాశ్ రెడ్డి ఆదివారం తన పార్లమెంట్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఎంపీ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు కుటుంబ సన్నిహితులు అవినాశ్ రెడ్డి ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏక్షణాన ఏం జరుగుతందోనన్న టెన్షన్ మెదలైంది.

ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ అనంతరం దూకుడు

రెండు రోజుల క్రితం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కి సన్నిహితుడిగా పేర్కొన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఉదయ్ కుమార్ రెడ్డి చెరిపివేశారని సీబీఐ ఆరోపించింది. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ ఈ అంశాలను పేర్కొంది. అనంతరం ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో ఈనెల 26 వరకూ రిమాండ్‌ విధించారు. ఉదయ్‌కుమార్‌ రెడ్డి తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్‌ మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి : Big Breaking: వైఎస్ భాస్కర్ రెడ్డికి రిమాండ్

Advertisement

Next Story