చికిత్సకోసం వెళ్లిన మహిళ అదృశ్యం..

by Sumithra |
చికిత్సకోసం వెళ్లిన మహిళ అదృశ్యం..
X

దిశ, సారంగాపూర్ : మండలంలోని జామ్ గ్రామానికి చెందిన జంగం యమున (30)కి ఎనిమిది ఏండ్ల క్రితం కామారెడ్డి బ్రాహ్మణ పెళ్లికి చెందిన జంగం అనిల్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో నాలుగు నెలల క్రితం భర్తతో గొడవపడి పుట్టింటికి జాం గ్రామానికి వచ్చి తన తండ్రి వద్ద ఉంది.

చేతికి గాయమైందని ఆయుర్వేద చికిత్స కోసం మామిడకు వెళ్లిన యమున సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడి తన వద్ద ఉన్న ఫోన్ కి ఫోన్ చేశారు. స్విచాఫ్ రావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఆమె చామనఛాయ వర్ణం, ఎత్తు 5.5, ఎరుపు రంగు పంజాబీ ధరించిందని ఫిర్యాదు చేయగా సారంగాపూర్ ఎస్సై కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed