భర్త, అత్తల వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య..

by Kalyani |
భర్త, అత్తల వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య..
X

దిశ, శ్రీరంగాపూర్: భర్త, అత్తల వేధింపులు తాళ లేక ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తాటిపాముల గ్రామానికి చెందిన సరోజ (32), వెంకటయ్యలు భార్యభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. కుటుంబ కలహాల్లో భాగంగా భర్త వెంకటయ్యతో పాటు అత్త సాయమ్మలు తరచూ సరోజతో గొడపడేవారు. ఈ క్రమంలో పలుమార్లు గొడవ జరగడంతో సరోజ అప్పడప్పుడు తల్లిగారికి ఇంటికి వెళ్లేది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో ఇరువురికి సర్దిచెప్పి పంపించేది.

ఇది ఇలా ఉండగా శనివారం మళ్లీ సరోజను భర్త వెంకటయ్య, అత్త సాయమ్మలు శారీరకంగా, మానసికంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సరోజ శనివారం అర్ధరాత్రి ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గది తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో ఉన్న సరోజను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే సరోజ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇది ఇలా ఉండగా సరోజను కొట్టి చంపారని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story