- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హోలీ పండగ రోజు తీవ్ర విషాదం..
దిశ, నందిగామ : హోలిపండగ వేళ నందిగామ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. నందిగామ గ్రామానికి చెందిన జంగారి మహేందర్ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివిరాల్లోకెళితే నందిగామకు చెందిన జంగారి మహేందర్ తన విధులు నిర్వహించుకుని స్కూటీ పై తిరుగుప్రయాణం అయ్యాడు. మరోవైపు ఇన్ములనర్వ గ్రామానికి చెందిన ఇంతియాజ్ అనే వ్యక్తి తన విధులు నిర్వహించుకుని ఎలక్ట్రికల్ స్కూటీ పై షాద్ నగర్ నుండి ఇన్ములనర్వ వెళ్తున్నాడు.
సరిగ్గా చాక్లేట్ కంపెనీ ముందర నందిగామ వాసి జంగారి మహేందర్ స్కూటీ, ఇంతియాజ్ ఎలక్ట్రికల్ స్కూటీ రెండు ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయలపాలయ్యారు. ఇద్దరికీ తలకు బలమైన గాయాలు కావడంతో ఇంతియాజ్ కోమాలోకి వెళ్ళగా, మహేందర్ ని శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సపొందుతూ మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి మృతదేహాన్ని తరలించారు. ఇంతియాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కోమాలో ఉన్న ఇంతియాజ్ ని హైదరాబాద్ హాస్పిటల్ కి తరలించారు. కాగా మృతిచెందిన మహేందర్ కుటుంబసభ్యుల మానవత్వంతో నేత్రదానం చేశారు. అతని రెండు కళ్ళు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి దానం చేసినట్టు కుటుంబం తెలిపారు.