Tragedy: కేపీహెచ్‌బీలో తీవ్ర విషాదం.. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా యువకుడి మృతి

by Shiva |
Tragedy: కేపీహెచ్‌బీలో తీవ్ర విషాదం.. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా యువకుడి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని కేబీహెచ్‌బీ (KPHB)‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోజు మాదిరిగానే విష్ణువర్ధన్ (Vishuvardhan) (31) అనే యువకుడు కార్తీక మాసం కావడంతో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసేందుకు వెళ్లాడు. అయితే, ప్రదక్షిణలు ప్రారంభించిన కొద్దిసేపటికే విష్ణువర్ధన్ గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో గమనించిన ఆలయ నిర్వాహకులు, తోటి భక్తులు అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లుగా నిర్ధారించారు.

Next Story