భర్త నాలుక కొరికేసిన భార్య ఎందుకంటే?

by Hamsa |   ( Updated:2023-01-28 06:18:20.0  )
భర్త నాలుక కొరికేసిన భార్య ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: భార్య, భర్తలకు చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తుంటాయన్న విషయం తెలిసిందే. కానీ కొన్నిసార్లు చిన్నపాటి గొడవలు శృతిమించుతున్నాయి. వీటిని మర్చిపోయి కలిసి మెలసి ఉండకుండా నిత్యం అదే విషయంపై చర్చించుకుంటూ ఒకరిపై మరొకరు దాడికి పాల్పడుతుంటారు. తాజాగా ఓ భార్యను పుట్టింటి నుండి రమ్మనందుకు భర్త నాలుకను కొరికేసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూ జిల్లాలో మున్నా, సల్మా దంపతులు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇద్దరు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మున్నా, సల్మా మధ్య తరచూ ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతుండేవి. దీంతో సల్మా అది తట్టుకోలేక పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మున్నా, సల్మాను తన ఇంటికి తీసుకురావడానికి శుక్రవారం అత్తారింటికి వెళ్లాడు. ఇక నుండి గొడవలు పడనని తిరిగి తన వెంట రావాలని భార్యను మున్నా కోరాడు. దానికి ఆమె నిరాకరించడంతో వీరిద్దరి మధ్య మరోసారి గొడవ మొదలైంది. అది కాస్త పెరగడంతో పిల్లలను తన వెంట తీసుకెళ్తానని మున్నా భార్యకు చెప్పాడు. దీనికి సల్మా ఊగిపోయి మున్నా నాలుకను తెగేలా కొరికేసింది. తీవ్రంగా గాయపడ్డ మున్నా సృహా కోల్పోయి పడిపోయాడు. అది గమనించిన స్థానికులు మున్నాను ఆసుపత్రికి తరలించి పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: మత్తు మందు ఇచ్చి మైనర్‌పై సామూహిక అత్యాచారం..

Advertisement

Next Story