- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. మండుటెండలో 7 కిలోమీటర్లు నడవడంతో నిండు గర్భిణీ మృతి
by Satheesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. ఆస్పత్రికి వెళ్లి రావడానికి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో మండుటెండలో ఓ నిండుగర్భిణి 7 కి.మీలు నడిచింది. దీంతో వడదెబ్బ తగిలి మృతి చెందింది. ఈ దారుణ ఘటన పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. గిరిజన గ్రామమైన ఓసర్ వీరాకు చెందిన సోనాలి వాఘట్ (29) తొమ్మిది నెలల గర్భిణి. నెలవారీ ఆరోగ్య పరీక్షల కోసం తవాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నడిచి వెళ్లింది. ఆ తరువాత అక్కడి నుంచి ఇంటికి నడిచి వచ్చింది. అలా మొత్తం 7 కి.మీ.లు మండుటెండలో నడిచింది. దీంతో వడదెబ్బ తగిలి.. సాయంత్రానికి సోనాలి తీవ్ర అస్వస్థతకు గురైంది. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఆమె అస్వస్థత కారణంగా కడుపులోని శిశువు కూడా ప్రాణాలు విడిచింది.
Advertisement
Next Story