- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్యపై అనుమానంతో ఆమెను చంపి ముక్కలుగా నరికిన భర్త
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది అక్రమ సంబంధాల వల్ల పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. మరికొంత మంది తమ భాగస్వామి పై అనుమానంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమెను చంపి ముక్కలుగా నరికాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని కాశీపూర్ గ్యామంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆరు నెలల క్రితం అతడికి జాబ్ రావడంతో రోజూ 70 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లేవాడు. ఈ క్రమంలో కొంత కాలంగా భార్యకు గ్రామంలోని ఓ వ్యక్తికి స్నేహం ఏర్పడింది. భర్త ఇంట్లో లేని సమయంలో అతనితో ఎక్కువ సమయం గడిపేది. ఈ విషయం భర్తకు తెలియడంతో అతడిని కలవొద్దని భార్యను హెచ్చరించాడు. అతని మాటను భార్య వినకపోవడంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అది కాస్త వివాదంగా మారడంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమెను గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఇంట్లో శబ్దాలు రావడంతో అది విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.