నీటి తొట్టిలో పడి బాలుడి మృతి..

by Sumithra |
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి..
X

దిశ, గూడూరు : ఏడాదిన్నర బాలుడు సరదాగా ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టెలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జంగుతండా గ్రామపంచాయితీ పరిధిలోని ఏఆర్ తండాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఈసం వీరస్వామి వినిత దంపతులకు చెందిన విహన్షుపటేల్ 18నెలల బాలుడు సరదాగా ఆడుకుంటు నీటితొట్టెలో పడడంతో మృతి చెందాడు. అప్పటి దాకా కళ్ళ ముందు తిరిగిన కుమారుడు కానరాని లోకాలకు వెళ్ళడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement
Next Story

Most Viewed