- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యార్థినిలపై ఇన్చార్జి ఎస్ఓ దాష్టీకం

దిశ, మంచిర్యాల : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలపై పాఠశాల ఇన్చార్జి ఎస్ఓ విచక్షణా రహితంగా చితకబాదిన ఘటన వెలుగు చూసింది. విద్యార్థినిలను ప్రేమగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. భీమిని మండలం కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థినిలపై శుక్రవారం అర్ధరాత్రి చితకబాదిన విషయం శనివారం బయటకు పొక్కింది. ఉదయం పాఠశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థినిల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి గేటు బయట ఉండిపోయారు. వారిని గమనించిన బాధిత విద్యార్థినిలు బయటకు వచ్చి వారి ఫోను నుండి తమపై చేయి చేసుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థినిలు ఫోన్లో మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన ఇన్చార్జి ఎస్ఓ విద్యార్థుల వద్ద నుండి సెల్ఫోన్ తీసుకొని దగ్గర పెట్టుకోవడంతో విషయం బయటకు వ్యాపించింది.
సమాచారాన్ని మండల విద్యాధికారి కృష్ణమూర్తికి తెలిసింది. మధ్యాహ్నం పాఠశాలకు చేరుకున్న విద్యాధికారి విద్యార్థులను ఇన్చార్జి ఎస్ఓ ముందుకు పిలిపించి విచారణ చేపట్టారు. పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులు చదువుతుండగా అల్లరి చేయడంతో కొట్టినట్లు విద్యాధికారి ముందర ఎస్ఓ చెప్పుకొచ్చింది. దీంతో బాధిత విద్యార్థినిలు ప్రతినెలా కాస్మోటిక్ తెచ్చి పాఠశాలలో తమ వద్ద నుండి డబ్బులు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థినులను చితకబాదిన విషయం సదరు ఎస్ఓ ఒప్పుకోవడంతో ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేసినట్లు మండల విద్యాధికారి తెలిపారు. ఆరవ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినిలలో ఒక విద్యార్థి కింద పడిపోయినట్లు తోటి విద్యార్థులు పేర్కొన్నారు. ఏది ఏమైనా విద్యార్థులపై చేయి చేసుకోవడం పై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.