- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శంకర్పల్లి బస్టాండ్ లో గంజాయి పట్టివేత..
by Sumithra |
X
దిశ, శంకర్పల్లి : శంకర్పల్లి బస్టాండ్ లో ఓ వ్యక్తి నుంచి సుమారు 6 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా నాగిలిగిద్ద మండలం సక్రు నాయక్ తండాకు చెందిన రాథోడ్ శంకర్ సోమవారం సంగారెడ్డి నుంచి బస్సులో మధ్యాహ్నం పూట శంకర్పల్లికి వచ్చాడు. బస్సు కోసం బస్టాండ్ లో వేచి ఉండగా అనుమానాస్పదంగా కనిపించిన రాథోడ్ శంకర్ ను పోలీసులు పట్టుకున్నారు.
అతని బ్యాగును తనిఖీ చేయగా అందులో సుమారు 6 కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు రాథోడ్ శంకర్ పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా శంకర్ పల్లి మండలంలో గంజాయి పట్టుపట్టడం పరిపాటిగా మారింది. యువత చెడు వ్యసనాలకు బానిస కావడంతోనే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి గంజాయి సరఫరా అవుతున్నట్టు తెలుస్తున్నది.
Advertisement
Next Story