- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం.. పోలీసుల సంచలన స్టేట్‌మెంట్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై దాడి చేసిన దుండగులను గుర్తించినట్లుగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు (Mumbai Crime Branch Police) ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇన్వెస్టిగేషన్ (Investigation)లో భాగంగా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) పక్కింట్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ (CC TV Footage)ను పరిశీలించగా.. అందులో ఇద్దరు దుండగుల కదలికలను గుర్తించామని తెలిపారు. అదేవిధంగా సైఫ్ ఇంట్లో దాడికి పాల్పడిన దుండగుడి ఫింగర్ ప్రింట్స్ (Finger Prints)ను కూడా సేకరించామని పేర్కొన్నారు. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడినట్లుగా గుర్తించామని తెలిపారు. అయితే, సైఫ్ ఇంటి మెయిన్ గేట్, ప్రధాన ద్వారం వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లో ఎలాంటి అనవాళ్లు దొరలేదని అన్నారు. ఫైర్ ఎగ్జిట్ (Fire Exit)నుంచి సైఫ్ ఇంట్లోకి దుండగుడు ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఆధారాలు లభించాయని పేర్కన్నారు. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు